10 రోజుల నుంచి పరారీలోనే కాకాణి... పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ
- క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసు
- కాకాణి ఎక్కడున్నారో కనిపెట్టలేకపోయిన పోలీసులు
- కాకాణి పిటిషన్లపై ఈరోజు హైకోర్టులో విచారణ
క్వార్ట్జ్ కేసులో కాకాణికి పోలీసులు మూడు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన విచారణకు డుమ్మా కొట్టారు. మరోవైపు, ఈ కేసులో కాకాణి దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.