హౌతీలను అమెరికా బలగాలు ఎలా హతమార్చాయో వీడియో విడుదల చేసిన ట్రంప్... వీడియో ఇదిగో!
- ట్రంప్ ఆదేశాలతో హౌతీలపై అమెరికా బలగాల దాడులు
- దాడుల్లో 50 మందికి పైగా హౌతీలు హతం
- తమ నౌకలపై హౌతీలు ఎప్పటికీ దాడి చేయలేరన్న ట్రంప్
తాజాగా దాడికి సంబంధించిన డ్రోన్ దృశ్యాలను ట్రంప్ విడుదల చేశారు. రౌండ్ గా నిలుచున్న సమూహంపై దాడి చేసినట్టు వీడియోలో కనిపిస్తోంది. నౌకలపై దాడి చేసేందుకు వాళ్లు సమావేశమయ్యారని ట్రంప్ చెప్పారు. వాళ్లు ఎప్పటికీ నౌకలపై దాడి చేయలేరని అన్నారు. అమెరికా వాణిజ్య, నేవీ నౌకలు స్వేచ్ఛగా వెళ్లకుండా ఏ ఉగ్రశక్తి ఆపలేదని చెప్పారు. హౌతీలకు మద్దతు ఇవ్వడాన్ని ఇరాన్ ఆపేయాలని హెచ్చరించారు.
ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ స్పందిస్తూ... హౌతీల దాడుల్లో తమ ప్రమేయం లేదని చెప్పారు. సొంత కారణాలతో హౌతీలు దాడులకు పాల్పడుతున్నారని... ఈ విషయంలో తమపై అనవసర ఆరోపణలు చేస్తే అమెరికా తగు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. మరోవైవు, అమెరికా దాడులను హౌతీ పొలిటికల్ బ్యూరో యుద్ధ నేరంగా అభివర్ణించింది.