ఫైర్ సేఫ్టీ అలారం ఎందుకు పని చేయలేదో దర్యాప్తు చేస్తున్నాం: అనిత
- ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం
- అగ్నిప్రమాదంపై శాఖాపరమైన విచారణ జరుగుతుందన్న అనిత
- అన్ని కోణాల్లో విచారణ జరుగుతుందన్న హోం మంత్రి
ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ... అగ్నిప్రమాదంపై శాఖాపరమైన విచారణ జరుగుతుందని చెప్పారు. బ్యాటరీ రూమ్ పూర్తిగా కాలిపోయిందని తెలిపారు. ఫైర్ సేఫ్టీ అలారం ఎందుకు పని చేయలేదో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతుందని తెలిపారు. సచివాలయంలోని అన్ని బ్లాక్స్ ను పూర్తిగా తనిఖీ చేసి అగ్నిప్రమాదాల విషయంలో ఏమేరకు సురక్షితంగా ఉన్నాయో రిపోర్టు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం, హోం మంత్రి, ఆర్థిక మంత్రి ఉండే కీలక బ్లాకులో ప్రమాదం జరగడం పట్ల ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు.