అరుణాచలంలో సినీ నటి స్నేహ, ఆమె భర్త చేసిన పనికి మండిపడుతున్న భక్తులు
- తెల్లవారుజామున అరుణాచలం ఆలయాన్ని దర్శించుకున్న స్నేహ దంపతులు
- చెప్పులు ధరించి గిరి ప్రదక్షిణ చేసిన వైనం
- మహా పాపం చేశారంటూ మండిపడుతున్న భక్తులు
దీంతో, స్నేహ, ప్రసన్నలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెప్పులు వేసుకుని గిరి ప్రదక్షిణ చేయడం ఏమిటని భక్తులు మండిపడుతున్నారు. అపచారం చేశారని, ఇది మహా పాపమని వ్యాఖ్యానిస్తున్నారు. తెలియక చేసుంటారని స్నేహ దంపతులకు కొందరు అండగా నిలుస్తున్నారు.
మన దేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో అరుణాచలం ఒకటి. అరుణాచలం దర్శనానికి ముందు జీవితం వేరు, దర్శనం తర్వాత జీవితం వేరు అని భక్తులు భావిస్తుంటారు. గిరి ప్రదక్షిణ చేసి శివుడిని దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందనేది భక్తుల నమ్మకం. ప్రతిరోజు ఎంతో మంది భక్తులు అరుణాచలం ఆలయాన్ని సందర్శిస్తుంటారు.