ఢిల్లీ బౌలర్ల విజృంభణ.. అనికేత్ ఒంటరి పోరాటం... డీసీ లక్ష్యం ఎంతంటే?
- 18.4 ఓవర్లలో 163 పరుగులకు హైదరాబాద్ ఆలౌట్
- 5 వికెట్లతో చెలరేగిన మిచెల్ స్టార్క్
- అనికేత్ పోరాటంలో గౌరవప్రదమైన స్కోరు సాధించిన హైదరాబాద్
ఈ సమయంలో అనికేత్‌వర్మ, క్లాసెన్ ఇద్దరూ ఆపద్బాంధవులయ్యారు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఐదో వికెట్‌గా క్లాసెన్ పెవిలియన్ చేరిన తర్వాత వికెట్ల పతనం మరోమారు మొదలైంది. మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్ ఇద్దరూ పోటీలు పడి వికెట్లు తీశారు. స్టార్క్ ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ మూడు వికెట్లు తీసుకున్నాడు.
మరోవైపు, వికెట్లు పడిపోతున్నా అనికేత్ మాత్రం ఎలాంటి తొట్రుపాటు లేకుండా నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుపై పరుగులు పేర్చుకుంటూ పోయాడు. 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 74 పరుగులు చేసిన అనికేత్... కుల్దీప్ యాదవ్‌కు చిక్కి ఎనిమిదో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత రెండు వికెట్లు పడటానికి ఎంతో సమయం పట్టలేదు. అనికేత్ ఒంటరిపోరాటంతో హైదరాబాద్ 18.4 ఓవర్లలో 163 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.