ఐశ్వర్య రాయ్ కారుకు ప్రమాదం

Aishwarya Rais Car Involved in Minor Accident
  • ప్రమాదానికి గురైన ఐశ్వర్య రాయ్ కారు
  • ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు
  • కారు ప్రమాదంపై సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • పెద్ద ప్రమాదమేమీ జరగలేదని స్థానిక మీడియాకు వెల్లడించిన ఐశ్వర్య రాయ్ టీమ్  
బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్యా రాయ్ కు చెందిన కారు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో ఐశ్వర్య కారులో లేరని తెలుస్తోంది. వెనుక నుండి వచ్చిన ఒక బస్సు ఢీకొనడంతో ఐశ్వర్య కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు వార్తలు వచ్చాయి.

ఈ ఘటనకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పలువురు అభిమానులు ఐశ్వర్యకు ఏమైందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో ఆమె కారులో లేరని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.

సోషల్ మీడియాలో కారు ప్రమాదానికి సంబంధించిన వార్త వైరల్ కావడంతో ఐశ్వర్యా రాయ్ టీమ్ స్పందించింది. ఇది పెద్ద ప్రమాదం కాదని స్థానిక మీడియాకు ఆమె టీమ్ తెలియజేసినట్లు సమాచారం. 
Go Back to Shorts
Aishwarya Rai
Aishwarya Rai car accident
Bollywood actress
car accident
minor accident
social media
viral video
Aishwarya Rai's team statement
traffic accident
India

More Telugu News