వెనెజులా నుంచి ఆయిల్ కొనే దేశాలకు ట్రంప్ వార్నింగ్
- 25 శాతం పన్నులు విధిస్తామని తేల్చిచెప్పిన అమెరికా అధ్యక్షుడు
- ప్రత్యక్షంగా, పరోక్షంగా.. ఎలా కొన్నా సరే టారిఫ్ లు తప్పవని వెల్లడి
- భారత్, చైనాలపై పడనున్న ప్రభావం
ఎందుకీ నిర్ణయం..
ట్రంప్ ఇటీవల అక్రమంగా అమెరికాలో ఉంటున్నవారిని యుద్ధ విమానాలలో వారి వారి స్వదేశాలకు పంపిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా వెనెజులా పౌరులు 200 ల మందిని ప్రత్యేక విమానాల్లో ట్రంప్ వాపస్ పంపించారు. దీనిపై మండిపడ్డ వెనెజులా.. ఇకపై అమెరికా విమానాలను తమ దేశంలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. అదేసమయంలో అమెరికాకు చమురు ఎగుమతులపైనా ఆంక్షలు విధించింది. వెనెజులా నిర్ణయంపై మండిపడ్డ ట్రంప్.. తాజాగా ఆ దేశం నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేయొద్దని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అలా కొనుగోలు చేస్తే ఆయా దేశాలు అమెరికాకు చేసే ఎగుమతులపై 25 శాతం పన్నులు విధిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.