'కన్నప్ప' చిత్రం గురించి ట్రోల్ చేస్తే కచ్చితంగా శివుడి శాపానికి గురవుతారు: నటుడు రఘుబాబు

Raghubabu Warns Against Kannappa Movie Trolls
  • మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన కన్నప్ప మూవీ
  • మోహన్ బాబు నిర్మాణంలో ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో చిత్రం
  • ప్రమోషన్ ఈవెంట్ లో ట్రోలర్స్ ను సీరియస్ గా హెచ్చరించిన రఘుబాబు
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రిలీజ్ కు సిద్ధమైంది. మోహన్ బాబు నిర్మాణ సారథ్యంలో ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎపిక్ మూవీ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఓ ప్రమోషన్ ఈవెంట్ లో నటుడు రఘుబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. వేదికపై మంచు విష్ణు, బ్రహ్మాజీ, రఘుబాబు కూర్చుని ఉండగా, ఓ మీడియా ప్రతినిధి ప్రశ్న అడిగారు. 

ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నేను చెప్పేది వినండి అంటూ రఘుబాబు మైక్ అందుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఇప్పుడే చెబుతున్నా... ఈ సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేశారంటే శివుడి ఆగ్రహానికి, శాపానికి గురవుతారు... గుర్తుపెట్టుకోండి. నేను చెప్పింది 100 శాతం జరిగి తీరుతుంది. ఎవరైనా సరే... ట్రోల్ చేశారంటే ఫినిష్!" అంటూ సీరియస్ గా హెచ్చరించారు.
Go Back to Shorts
Raghubabu
Kannappa
Manchu Vishnu
Mohan Babu
Mukesh Kumar Singh
Telugu Cinema
Movie Release
April 25th Release
Film Promotion
Actor Warning

More Telugu News