ఎమ్మెల్యేకి కోపం వచ్చింది... అరటి బోదెతో కొట్టాడు!
పింక్ రిబ్బన్ ఎందుకు కట్టారని, సదరు బ్రిడ్జి కాంట్రాక్టర్ వద్ద పనిచేసే ఉద్యోగులను ఎమ్మెల్యే ప్రశ్నించారు. రెడ్ రిబ్బన్ లేకపోవడంతో పింక్ రిబ్బన్ కట్టామని ఓ ఉద్యోగి బదులిచ్చాడు. దాంతో మండిపడిన ఎమ్మెల్యే సంసుల్ హుడా... ఆ ఉద్యోగి చొక్కా పట్టుకుని ముందుకు లాగి చెంప చెళ్లుమనిపించాడు. అంతేకాదు, అక్కడే తోరణాలు కట్టేందుకు తీసుకువచ్చిన అరటి బోదెను అందుకుని ఆ ఉద్యోగిపై దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.