డిసెంబర్ వరకు పార్టీ బలోపేతం... వచ్చే ఏడాది నుండి పాదయాత్ర చేస్తా: కేటీఆర్
- ప్రస్తుతం జిల్లాల పర్యటనలలో ఉన్నానన్న కేటీఆర్
- బీఆర్ఎస్ కార్యక్రమాలకు అద్భుత స్పందన వస్తోందన్న కేటీఆర్
- ప్రజల కోసం బీఆర్ఎస్‌కు అధికారం ఖాయమన్న కేటీఆర్
బీఆర్ఎస్ కార్యక్రమాలకు అద్భుత స్పందన వస్తోందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనను అంతం చేయాలని, ప్రజల కోసం బీఆర్ఎస్‌కు అధికారం అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమాలు, పోరాటాలు, అధికారం, ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్‌కు కొత్తేమీ కాదని అన్నారు.
కాంగ్రెస్ అరాచక పాలనను అంతం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఫినిక్స్ పక్షిలా పైకి ఎగురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.