ఆధార్ తో ఓటరు కార్డు అనుసంధానానికి మొగ్గు చూపిన ఎన్నికల సంఘం
- చర్చనీయాంశంగా ఉన్న ఆధార్-ఓటరు కార్డు లింకింగ్
- నేడు కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో కీలక సమావేశం
- త్వరలో సాంకేతిక నిపుణుల సంప్రదింపుల కమిటీ సమావేశం
ఆధార్ తో ఓటరు కార్డు లింక్ చేయడంపై నేడు కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, శాసన వ్యవహారాల కార్యదర్శి... ఆధార్, ఓటరు కార్డు సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.