Revanth Reddy: కేసీఆర్ చావు కోరుకునేలా రేవంత్ రెడ్డి మాట్లాడారంటూ... సీఎం స్పీచ్ ను వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

BRS boycotts Revanth Reddy speech
షార్ట్స్‌లో చూడండి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చావును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుకున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం ప్రసంగాన్ని బహిష్కరించారు. ​అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం మీడియాతో హరీశ్ రావు మాట్లాడుతూ కేసీఆర్ ను మార్చురీకి పంపిస్తామని రేవంత్ అన్నారని... అందుకే ఆయన ప్రసంగాన్ని ​బహిష్కరించామని చెప్పారు. తెలంగాణ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం దారుణమని అన్నారు. 

అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ అన్నీ అబద్ధాలే చెప్పారని హరీశ్ విమర్శించారు. కాంగ్రెస్ వల్ల కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్నారు. ఈ మధ్య ఏపీ సీఎం చంద్రబాబును ఉత్తమ్ కుమార్ ​రెడ్డి దంపతులు కలిశారని... ఆయనతో కలసి ​భోజనం చేసి వచ్చారని చెప్పారు. 
Go Back to Shorts
Revanth Reddy
Congress
Harish Rao
BRS

More Telugu News