బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో సుప్రీం కీలక ఆదేశాలు
- అసెంబ్లీ సెక్రెటరికి, తెలంగాణ ప్రభుత్వానికి, ఈసీకి నోటీసులు జారీ
- ఈ నెల 25 లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆర్డర్
- కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డమాండ్
కాంగ్రెస్ లో చేరిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 15న బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్పీ)ను దాఖలు చేశారు. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీపై కేటీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను అన్నింటినీ సుప్రీంకోర్టు కలిపి విచారిస్తోంది.