ఇది గమనించారా... బంగారం ధర ఇంకాస్త తగ్గింది!
- ఇటీవల దూసుకెళ్లిన బంగారం ధర
- తాజాగా రూ.500 తగ్గిన వైనం
- ఢిల్లీలో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.87,700
స్టాక్ మార్కెట్లలో ఇన్వెసర్లు లాభాల స్వీకరణకు దిగడం, నగల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో బంగారం ధర దిగొచ్చిందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు వెండి ధర కూడా తగ్గింది. నిన్న రూ.98,500 పలికిన కిలో వెండి... నేడు రూ.96,400 పలుకుతోంది.