నేపాల్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు!
ఈ భూకంపం కారణంగా నేపాల్‌లోని అనేక ప్రాంతాలలో ప్రధానంగా తూర్పు, మధ్య ప్రాంతాలలోని ప్రజలు భూప్రకంపనలకు లోనైనట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. ప్రస్తుతం స్థానిక అధికారులు ప్రభావిత ప్రాంతాలలో పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అటు భారత్, టిబెట్, చైనా సరిహద్దు ప్రాంతాలలో కూడా ప్రకంపనలు సంభవించాయి.