అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు... కూటమి ప్రభుత్వ నిర్ణయం
- వివిధ స్థాయిల్లో బ్రాండ్ అంబాసిడర్లు
- నామినేషన్ పద్ధతిలో అర్హత, నైపుణ్యం ఆధారంగా నియామకం
- ఏడాది కాలానికి బ్రాండ్ అంబాసిడర్ల నియామకం
నామినేషన్ ప్రాతిపదికన బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని, సీఎం లేదా సీఎంవో నామినేట్ చేసినవారిని నియమించేందుకు కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. నామినేషన్లతో పాటు నైపుణ్యం, అర్హత, స్థాయి ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఈ బ్రాండ్ అంబాసిడర్ల నియామకం ఏడాది కాలానికి వర్తించనుంది.
అంతర్జాతీయ నగరంగా అమరావతిని ప్రమోట్ చేయడం, పెట్టుబడులు ఆకర్షించడం ఈ కార్యాచరణ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలు.