15 నెలల ప్రత్యక్ష నరకం తర్వాత కుటుంబాన్ని కలిసిన వేళ.. హమాస్ బందీల భావోద్వేగం.. వీడియో ఇదిగో!
- ఇజ్రాయెల్ హమాస్ మధ్య అమలులోకి కాల్పుల విరమణ ఒప్పందం
- తొలిదశలో ముగ్గురు బందీలను విడిచిపెట్టిన మిలిటెంట్లు
- 90 మంది పాలస్తీనా ఖైదీలను రిలీజ్ చేసిన ఇజ్రాయెల్
హమాస్ మిలిటెంట్లు విడుదల చేసిన ముగ్గురు మహిళలు.. రోమి గోనెన్, డోరన్ స్టెయిన్ బ్రీచర్, ఎమిలి డామరి అని ఇజ్రాయెల్ అధికార వర్గాలు తెలిపాయి. కాగా, బందీలకు స్వాగతం పలికేందుకు టెల్ అవీవ్ లోని హోస్టేజ్ స్క్వేర్ వద్ద వేలాదిగా పౌరులు గుమిగూడారు. సైనిక వాహనాల్లో నుంచి ముగ్గురు బందీలు దిగడం చూసి వారంతా సంతోషంతో కేరింతలు కొట్టారు. పలువురు సంగీతం ప్లే చేస్తూ దేశభక్తి గీతాలు పాడారు. బందీలను ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ లో పలకరించారు. యావత్ దేశం మిమ్మల్ని ఇంటికి స్వాగతిస్తోందని చెప్పారు. కాగా, ముగ్గురు బందీల విడుదలతో మిగతా బందీల కుటుంబాల్లో ఆశలు చిగురించాయి.