Saif Ali Khan: సైఫ్ నటుడు అని తెలియదన్న నిందితుడు

Accused said in statement that he was unaware of Saif Ali Khan
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసిన నిందితుడ్ని ముంబయి పోలీసులు థానేలో అరెస్ట్ చేయడం తెలిసిందే. అతడి పేరు షరిఫుల్ ఇస్లామ్ షేజాద్. అతడ్ని ఓ బంగ్లాదేశీ జాతీయుడిగా గుర్తించారు. కాగా, తన స్టేట్ మెంట్ లో ఆ వ్యక్తి ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. 

తాను చొరబడింది ఓ సెలబ్రిటీ ఇల్లు అని, తాను దాడి చేసింది ఓ నటుడిపై అని తనకు తెలియదన్నాడు. ఎవరో మామూలు వ్యక్తి అనుకునే ఆ ఇంట్లో ప్రవేశించానని తెలిపాడు. దాడి తర్వాత టీవీల్లో వార్తలు చూసి థానేకు పారిపోయానని వివరించాడు. 

తన ఫోన్ స్విచాఫ్ చేసి, అక్కడే ఉన్న ఓ లేబర్ క్యాంపులో తలదాచుకున్నానని తెలిపాడు. సైఫ్ అలీ ఖాన్ ఇంటి వెనుకభాగంలోని మెట్ల మీదుగా వచ్చి, ఏసీ పైపు ద్వారా లోపలికి చేరుకున్నానని నిందితుడు విచారణలో వెల్లడించాడు. .
Go Back to Shorts
Saif Ali Khan
Stabbing
Attacker
Mumbai
Bollywood

More Telugu News