కంగన మూవీపై సద్గురు రివ్యూ.. ఏంచెప్పారంటే?
- ఎమర్జెన్సీ.. యువత తప్పక చూడాల్సిన సినిమా అని వ్యాఖ్య
- చరిత్రను తెలియజెప్పే ప్రయత్నంలో కంగన సఫలమైందని వెల్లడి
- సినీ ప్రయాణంలో కంగన మరో మెట్టు ఎక్కిందని ప్రశంస
ఎమర్జెన్సీ సమయంలో తాను యూనివర్సిటీ విద్యార్థినని సద్గురు చెప్పారు. ఆ సమయంలో జరిగిన పరిణామాలు తనలాంటి వారికి ప్రత్యక్ష అనుభవం.. కానీ యువతకు ఆ వివరాలు తెలియవని, పాఠ్యపుస్తకాలలోనూ దాని గురించి అతి తక్కువ సమాచారమే ఉందని అన్నారు. ఈ సినిమాలో కంగన చాలా విషయాలను చూపించారని సద్గురు మెచ్చుకున్నారు. కాగా, ఎమర్జెన్సీ సినిమాలో ఇందిరాగాంధీ పాత్రను పోషించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలను కూడా స్వయంగా కంగనానే చూసుకున్నారు. సద్గురు రివ్యూపై కంగన స్పందిస్తూ.. సద్గురు ఇచ్చిన కాంప్లిమెంట్ కు మించిన ప్రశంస ఇంకేదీ లేదని, తన హృదయం ప్రేమతో నిండిపోయిందని కంగనా రనౌత్ పేర్కొన్నారు.