సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై విచారణకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
- గత ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్ గా వ్యవహరించిన సునీల్ కుమార్
- సునీల్ కుమార్ పై అనేక ఆరోపణలు
- ఇద్దరు అధికారులతో విచారణ అథారిటీ ఏర్పాటు చేసిన కూటమి సర్కారు
ఈ అథారిటీలో ఇద్దరు విచారణ అధికారులను నియమించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, విజిలెన్స్ డీజీ హరీశ్ కుమార్ గుప్తా ఈ అథారిటీలో విచారణ అధికారులుగా వ్యవహరిస్తారు. సునీల్ కుమార్ పై విచారణ పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా నివేదిక అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.