డిసెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.1.77 లక్షల కోట్లు... వరుసగా పదో నెల రూ.1.7 లక్షల కోట్లు క్రాస్

GST collection rises above 7 percent in December 2024
జీఎస్టీ వసూళ్లు గత ఏడాది డిసెంబర్ నెలలో భారీ స్థాయిలో నమోదయ్యాయి. 2024 డిసెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.1.77 లక్షల కోట్లుగా నమోదయ్యాయని ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ డేటా వెల్లడించింది. అంతకుముందు ఏడాదితో పోల్చితే 7.3 శాతం వృద్ధి నమోదైంది. 2023 డిసెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.1.65 లక్షల కోట్లు నమోదయ్యాయి.

సీజీఎస్టీ రూపంలో రూ.32,836 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూపంలో రూ.40,499 కోట్లు వచ్చాయి. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ కింద రూ.91,200 కోట్లు, సెస్‌ల రూపంలో రూ.12,300 కోట్లు వచ్చినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది. ఇందులో దిగుమతులపై విధించిన పన్నుల నుంచి వచ్చిన రెవెన్యూ 4 శాతం పెరిగి రూ.44,268 కోట్లుగా ఉంది.

జీఎస్టీ వసూళ్లు రూ.1.7 లక్షల కోట్లు దాటడం వరుసగా ఇది పదో నెల. మార్చి నెల నుంచి జీఎస్టీ వసూళ్లు ఈ స్థాయిని దాటుతున్నాయి. నవంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.82 లక్షల కోట్లు నమోదయ్యాయి. గత ఏడాది అత్యధికంగా ఏప్రిల్ నెలలో రూ.2.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.
Go Back to Shorts
GST
GST Collection
India

More Telugu News