ప్రజల కారణంగా వైసీపీ ఓడిపోలేదు... ఉద్యోగులు కూడా బాధపడుతున్నారు: రోజా
- చంద్రబాబు అప్పులపై అప్పులు చేస్తున్నారన్న రోజా
- కూటమి నేతల తప్పుడు ప్రచారం వల్లే వైసీపీ ఓడిపోయిందని వ్యాఖ్య
- రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని ధీమా
ప్రజల కారణంగా వైసీపీ ఓడిపోలేదని... కూటమి నేతల తప్పుడు ప్రచారం వల్లే ఓడిపోయిందని రోజా అన్నారు. జగన్ ఓడిపోయినందుకు ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని చెప్పారు. జగన్ హయాంలో ప్రజలకు అన్ని పథకాలు అందాయని తెలిపారు. వైసీపీ హయాంలో స్కూళ్లను జగన్ అద్భుతంగా తీర్చిదిద్దారని... కూటమి ప్రభుత్వం వైన్ షాపులను అభివృద్ధి చేస్తోందని చెప్పారు.
జగన్ ను ఓడించాలని ఉద్యోగులు కంకణం కట్టుకున్నారని... చంద్రబాబును ఎందుకు గెలిపించామా? అని ఇప్పుడు వాళ్లంతా బాధపడుతున్నారని అన్నారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కుప్పం సహా అన్ని నియోజకవర్గాలను వైసీపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ క్యాడర్ ను ఎవరెవరైతే ఇబ్బందులు పెడుతున్నారో... వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు. పచ్చ మీడియా అసత్యాలను ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.