Jani Master: నేను నిందితుడిని మాత్ర‌మే.. నిర్దోషిగా బ‌య‌టకొస్తా: జానీ మాస్ట‌ర్‌

Let the Law Decide the Verdict Jani Master Special Video
షార్ట్స్‌లో చూడండి
మహిళా కొరియోగ్రాఫ‌ర్‌పై జానీ మాస్ట‌ర్ లైంగిక దాడి నిజమేన‌ని తాజాగా హైద‌రాబాద్ నార్సింగి పోలీసులు ఛార్జిషీట్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై జానీ మాస్టర్ స్పందించారు. న్యాయ‌స్థానం మీద త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌ని, నిర్దోషిగా బ‌య‌టకు వ‌స్తాన‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆయన సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక వీడియో విడుద‌ల చేశారు. 

"ఈ కేసులో ఏం జ‌రిగింద‌నేది నా మ‌న‌సుకు, దేవుడికి తెలుసు. ఏదైనా న్యాయ‌స్థానం నిర్ణ‌యిస్తుంది. నేను క్లీన్‌చిట్‌తో బ‌య‌ట‌కు వ‌స్తా. అప్పుడే మాట్లాడుతా. అప్ప‌టి వ‌ర‌కు నేను నిందితుడిని మాత్ర‌మే. అభిమానుల ప్రేమ నాపై ఎప్పుడూ ఉండాలి" అని వీడియోలో జానీ మాస్ట‌ర్ పేర్కొన్నారు. 

కాగా, తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ మహిళా కొరియోగ్రాఫర్ సెప్టెంబర్ 15న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో అక్టోబర్ 25న చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. అటు లైంగిక వేధింపుల కేసు కారణంగా జానీ మాస్టర్ నేషనల్ అవార్డును సైతం కోల్పోయిన విష‌యం తెలిసిందే.
Go Back to Shorts
Jani Master
Tollywood

More Telugu News