అస్సలు తగ్గేదే లేదంటున్న పుష్ప-2 కలెక్షన్లు.. 20 రోజుల్లో ఎంతకు చేరాయంటే?
- డిసెంబర్ 24 నాటికి సినిమా విడుదలై 20 రోజులు పూర్తి
- గురువారం దేశవ్యాప్తంగా రూ.14.25 కొట్లగొట్టిన పుష్ప-2
- రూ.1,075.60 కోట్లకు చేరిన దేశీయ కలెక్షన్లు
అత్యధికంగా హిందీలో రూ.11.5 కోట్లు కొల్లగొట్టింది. ఓరిజినల్ వెర్షన్ తెలుగు, ఇతర వెర్షన్లలో వసూళ్లు నెమ్మదించినప్పటికీ హిందీ రాష్ట్రాల్లో వసూళ్లు కొనసాగుతున్నాయి. దీంతో గురువారం నాటికి దేశవ్యాప్తంగా పుష్ప-2 కలెక్షన్లు రూ.1075.60 కోట్లకు పెరిగాయి. క్రిస్మస్ నుంచి న్యూఇయర్ వరకు హాలిడే సీజన్ కావడంతో ఈ సినిమా కలెక్షన్లు ఇదే విధంగా కొనసాగవచ్చనే సినీ ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. హిందీ రాష్ట్రాల్లో ఇతర సినిమాల పోటీని కూడా తట్టుకొని పుష్ప-2 నిలబడుతుండడం విశేషం.
కాగా, పుష్ప-2 కలెక్షన్లు దేశవ్యాప్తంగా రూ.700 కోట్ల, ప్రపంచవ్యాప్తంగా రూ.1600 కోట్లు దాటేసిన విషయం తెలిసిందే.