హరీశ్ రావును పక్కన కూర్చోబెట్టుకొని కారు నడిపిన కేటీఆర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హరీశ్ రావును పక్కన కూర్చోబెట్టుకొని కారు నడిపిన కేటీఆర్!

KTR drives car along with Harish Rao
  • ఇటీవల మర్రి జనార్ధన్ రెడ్డి తండ్రి మృతి
  • పరామర్శించేందుకు ల్యాండ్ క్రూయిజర్‌లో కలిసి బయలుదేరిన నేతలు
  • నాగర్ కర్నూల్ జిల్లాలోని జనార్దన్ రెడ్డి గ్రామానికి వెళ్లిన నేతలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఒకే కారులో ప్రయాణించారు. కేటీఆర్ డ్రైవింగ్ చేస్తుండగా హరీశ్ రావు పక్క సీటులో కూర్చున్నారు. వీరిద్దరు ల్యాండ్ క్రూయిజర్‌లో ప్రయాణించారు.

నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. మర్రి జనార్దన్ రెడ్డిని పరామర్శించేందుకు వీరు ఒకే వాహనంలో కలిసి వెళ్లారు.

కేటీఆర్ మొదట తన ల్యాండ్ క్రూయిజర్‍‌లో గచ్చిబౌలిలోని హరీశ్ రావు నివాసానికి వచ్చారు. అక్కడి నుంచి ఇద్దరు కలిసి బయలుదేరారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లి గ్రామంలో మర్రి జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్ళి పరామర్శించారు. 

ప్రయాణంలో జడ్చర్ల పట్టణంలో పార్టీ నేతలతో కలిసి కేటీఆర్, హరీశ్ రావు ఓ హోటల్లో టీ తాగారు.
Advertisement
KTR
Harish Rao
BRS

More Telugu News