అల్లు అర్జున్ కు తొక్కిసలాట వీడియో చూపించిన పోలీసులు!
- సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఏ11గా ఉన్న అల్లు అర్జున్
- నేడు చిక్కడపల్లి పీఎస్ లో విచారణ
- అల్లు అర్జున్ ను ప్రశ్నిస్తున్న డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ టీమ్
ఓ ప్రశ్నకు సమాధానంగా, తాను ఓ సాధారణ ప్రేక్షకుడిలా సంధ్య థియేటర్ కు వెళ్లానని అల్లు అర్జున్ చెప్పినట్టు సమాచారం. ఇక, సంధ్య థియేటర్ కు సెలబ్రిటీల రాకపై తాము అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల కాపీని కూడా పోలీసులు అల్లు అర్జున్ ముందు పెట్టగా... అందుకు కూడా ఆయన మౌనంగా ఉన్నట్టు తెలిసింది.