బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్న పుష్ప-2 హవా.. మరింత పెరిగిన కలెక్షన్లు

Pushpa 2 collections continuing at box office
  • శుక్రవారం నాడు రూ.13.75 కోట్ల వసూళ్లు
  • అత్యధికంగా హిందీలో రూ.11 కోట్లు
  • వీకెండ్ కావడంతో శని, ఆదివారాల్లో మరింత పెరిగే అవకాశం
విడుదలైన నాటి నుంచి అప్రతిహతంగా దూసుకెళుతున్న పుష్ప-2 మూవీ కలెక్షన్ల హవాను కొనసాగిస్తోంది. రిలీజ్ అయిన 16వ రోజున (శుక్రవారం) ఈ సినిమా రూ.13.75 కోట్లు వసూలు చేసిందని సినిమా కలెక్షన్లను ట్రాక్ చేసే ‘శాక్‌నిల్క్’ కథనం పేర్కొంది. తెలుగు వెర్షన్‌లో రూ. 2.4 కోట్లు, అత్యధికంగా హిందీలో రూ.11 కోట్లు, తమిళంలో రూ.30 లక్షలు, కన్నడలో రూ.3 లక్షలు, మలయాళంలో రూ.2 లక్షలు చొప్పున ఈ సినిమా వసూలు చేసినట్టు పేర్కొంది.

కాగా, పుష్ప-2 మూవీ తెలుగు వెర్షన్ కంటే హిందీలోనే ఎక్కువ కలెక్షన్లు రాబడుతోంది. వీకెండ్ కావడంతో శని, ఆదివారాల్లో వసూళ్లు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సినీ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కాగా, విడుదలైన అతి తక్కువ రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప-2 రికార్డు నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1400 కోట్లకు పైగా వసూలు చేసిన విషయం తెలిసిందే.

పుష్ప-2లో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించగా... సుకుమార్ దర్శకత్వం వహించారు. సునీల్, అనసూయతో పాటు పలువురు నటులు కీలక పాత్రల్లో నటించారు.
Advertisement
Pushpa 2
Pushpa 2 Collections
Allu Arjun
Movie News

More Telugu News