Chandrababu: పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu visits Polavaram project
షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ప్రాజెక్టు పరిశీలించారు. హిల్ వ్యూ పాయింట్ నుంచి కూడా పోలవరం డ్యామ్ ను పరిశీలించారు. గ్యాప్-1, గ్యాప్-2 పనులతో పాటు డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను కూడా చంద్రబాబు పరిశీలించారు. తన పర్యటన సందర్భంగా ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. 

ఇక, పనులు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అధికారులు, పోలవరం ప్రాజెక్టు ఇంజినీర్లతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతటి ప్రాధాన్యతా అంశమో వారికి వివరించారు. పోలవరం ప్రాజెక్టు భవిష్యత్ నిర్మాణాల షెడ్యూల్ ను చంద్రబాబు విడుదల చేయనున్నారు.

కాగా, పోలవరం పర్యటనలో చంద్రబాబు వెంట రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఉన్నారు.
Go Back to Shorts
Chandrababu
Polavaram Project
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News