నాగబాబుకు మంత్రి పదవి.... చంద్రబాబు కీలక నిర్ణయం
- రాష్ట్ర మంత్రివర్గంలో నాగబాబుకు చోటిచ్చిన చంద్రబాబు
- అధికారికంగా ప్రకటన విడుదల
- దాంతో నాలుగుకు పెరిగిన జనసేన మంత్రుల సంఖ్య
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా, పాతికమంది మంత్రులకు అవకాశం ఉంది. ప్రస్తుతం చంద్రబాబు క్యాబినెట్ లో 24 మంది మంత్రులు ఉన్నారు. జనసేన పార్టీకి 4 మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండగా, ప్రస్తుతం పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు జనసేన నుంచి నాలుగో మంత్రిగా నాగబాబు క్యాబినెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.