పెళ్లి తర్వాత జీవితంపై రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Add ap7am to your home Screen

పెళ్లి తర్వాత జీవితంపై రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Rakul Preet Singh on her marriage life
  • తన జీవితంలో పెద్దగా మార్పులు రాలేదన్న రకుల్
  • వెన్నుకు అయిన గాయం నుంచి కోలుకుంటున్నానని వెల్లడి
  • ప్రస్తుతం ఎక్కువ బరువులు ఎత్తడం లేదన్న రకుల్
పెళ్లి తర్వాత జీవితంలో ఏమైనా మార్పులు వచ్చాయా? అని తనను ఎంతో మంది అడిగారని... తన జీవితంలో అంత పెద్ద మార్పు అంటూ ఏమీ రాలేదని సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు. స్నేహితుడిని పెళ్లి చేసుకుంటే మార్పుల కంటే జీవితంలో ఎక్కువగా సరదాలు ఉంటాయని చెప్పారు. 

రెండు నెలల క్రితం రకుల్ గాయపడిన సంగతి తెలిసిందే. 80 కేజీల బరువును ఎత్తే క్రమంలో ఆమెకు గాయం కావడంతో వైద్యుల సలహా మేరకు రెస్ట్ తీసుకున్నారు. దీనిపై రకుల్ స్పందస్తూ... ఇప్పుడిప్పుడే తాను కోలుకుంటున్నానని చెప్పారు. వెన్నుకు గాయమైనప్పుడు రెండు వారాల్లో తగ్గిపోతుందనుకున్నానని... కానీ ఇప్పటికి ఎనిమిది వారాలయిందని తెలిపారు. 

ప్రస్తుతం ఎక్కువ బరువులు ఎత్తడం లేదని రకుల్ చెప్పారు. చిన్నచిన్న వర్కౌట్లు చేస్తున్నానని... ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నానని తెలిపారు. బరువు తగ్గడం ఎంతో కష్టమైన పని అని, ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలని సూచించారు. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని, రెగ్యులర్ గా వర్కౌట్లు చేయాలని చెప్పారు.  

మంచి నీళ్లు ఎక్కువగా తాగాలని రకుల్ సూచించారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే గోరు వెచ్చటి నీరు లేదా పసుపు కలిపిన గోరు వెచ్చటి నీరు తాగితే చర్మం కాంతివంతంగా తయారవుతుందని చెప్పారు. 
Advertisement
Rakul Preet Singh
Tollywood
Bollywood

More Telugu News