మృత్యువును సైతం ముద్దాడేందుకు కేసీఆర్ తెగించిన రోజు ఈరోజు: హరీశ్ రావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మృత్యువును సైతం ముద్దాడేందుకు కేసీఆర్ తెగించిన రోజు ఈరోజు: హరీశ్ రావు

Harish Rao praises KCR
  • దీక్షా దివస్ సందర్భంగా గతాన్ని గుర్తు చేసుకున్న హరీశ్ రావు
  • కేసీఆర్ చిత్తశుద్ధి, నిబద్ధత వల్లే తెలంగాణ సాధ్యమయిందని వ్యాఖ్య
  • ఆనాటి పరిస్థితులు ఇంకా తన ముందు కదలాడుతూనే ఉన్నాయన్న హరీశ్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్తశుద్ధి, నిబద్ధత వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమయిందని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. దీక్షా దివస్ సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘తెలంగాణ వచ్చుడో... కేసీఆర్‌ సచ్చుడో’ అని నినాదమిచ్చి రాష్ట్ర సాధన కోసం మృత్యువును సైతం ముద్దాడేందుకు కేసీఆర్‌ తెగించిన రోజు నేడు అని హరీశ్ తెలిపారు. తెలంగాణ ప్రజలే శ్వాసగా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఉద్యమం సాగించి... స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన సందర్భం ఇదని చెప్పారు. ఇన్నేళ్ళు గడిచినా ఆనాటి పరిస్థితులు ఇంకా నా ముందు కదలాడుతూనే ఉన్నాయని అన్నారు. 

'కేసీఆర్ చిత్తశుద్ధి, నిబద్ధత వల్లే రాష్ట్రం సాధ్యమైంది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ‘ది కోయిలేషన్ ఇయర్స్: 1996-2012’ పుస్తకంలో కేసీఆర్ నిబద్ధత గురించి ఇలా ప్రస్తావించారు. కేంద్ర మంత్రిగా మీకు ఏ శాఖ కేటాయించాలి అని అడిగినప్పుడు కేసీఆర్ ఇచ్చిన సమాధానం..  “ప్రణబ్‌జీ, నా లక్ష్యం మీకు తెలుసు. నాకు ప్రత్యేక తెలంగాణ కావాలి. మీరు నాకు ఏ శాఖను కేటాయించారనేది ముఖ్యం కాదు. మీరేది కేటాయించినా నాకు సమ్మతమే. కానీ దయచేసి తెలంగాణను ఇవ్వండి”. ఇదీ కేసీఆర్ అంటే. ఇదీ ఆయన కమిట్మెంట్.  కేసీఆర్ త్యాగాల ఫలం తెలంగాణ. కేసీఆర్ ఉద్యమ ఫలితం తెలంగాణ.  జై తెలంగాణ.. జై కేసీఆర్ అని హరీశ్ ట్వీట్ చేశారు.
Advertisement
Harish Rao
KCR
BRS

More Telugu News