జోర్డాన్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద కాల్పులు.. సాయుధుడి కాల్చివేత
- జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లోని ఎంబసీ వద్ద కాల్పులు
- పెట్రోలింగ్ సిబ్బందిపై కాల్పులు జరిపిన సాయుధుడు
- భద్రతా బలగాలు చుట్టుముట్టి జరిపిన కాల్పుల్లో దుండగుడి మృతి
- గాయపడిన ముగ్గురు పోలీసులకు చికిత్స
గాజాపై యుద్ధాన్ని నిరసిస్తూ ఇటీవలి కాలంలో జోర్డాన్‌లోని ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నాయి. జోర్డాన్‌లో దాదాపు 1.2 కోట్ల మంది పౌరులు పాలస్తీనా మూలాలున్నవారే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజా ఘటన జరగడం కలకలం రేపుతోంది. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించలేదు.