ఓయూ సంచలన నిర్ణయం... హిందీ మహా విద్యాలయ అనుమతులు రద్దు
- స్వయంప్రతిపత్తిని రద్దు చేయాలని యూజీసీకి సిఫార్సు
- ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల కోర్సు పూర్తి చేసేందుకు అవకాశం
- మార్కుల జాబితాలో అక్రమాలు జరిగినట్లు తేలడంతో నిర్ణయం
విద్యార్థుల మార్కుల జాబితాలో అక్రమాలు జరిగినట్లు ఓయూ విచారణ కమిటీ తేల్చడంతో ఓయూ ఈ నిర్ణయం తీసుకుంది. ఓ ప్రైవేటు కాలేజీలో ఓయూ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు కూడా విచారణ కమిటీ నిర్ధరించింది. ఈ క్రమంలో ఓయూ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.