నాగచైతన్య కెరీర్‌లో యాడ్ అవుతున్న మరో కొత్త జానర్ సినిమా!
- కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య
- మిథికల్ థ్రిల్లర్‌గా నాగచైతన్య కొత్త సినిమా
- డిసెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభం
- నాగచైతన్య బర్త్‌డే సందర్భంగా పోస్టర్ విడుదల
బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రానికి సుకుమార్ కూడా మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డిసెంబరులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. కాగా శనివారం కథానాయకుడు నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో ఓ పవర్‌ఫుల్ నేత్రంలో రాక్ క్లైంబింగ్ టూల్స్‌తో ఓ పర్వతంపై నిలబడి ఉన్న నాగ చైతన్య కనిపించారు.
ఇది ప్రేక్షకులలో ఆసక్తిని కలిగిస్తుంది. నాగచైతన్య కెరీర్‌లో 24వ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రానికి ఎన్‌సీ 24 అనే వర్కింగ్ టైటిల్‌ను నిర్ణయించారు. అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకోనున్న ఈ చిత్రంలో సిజీ వర్క్ గ్రాండ్‌గా ఉండబోతుందని, ఇందుకోసం ఉన్నతమైన సాంకేతిక నిపుణులను ఉపయోగిస్తున్నామని మేకర్స్ చెబుతున్నారు.
విజువల్‌గా ఈ సినిమా మరో స్థాయిలో ఉంటుందని అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. శ్యామ్ దత్ ఫోటోగ్రఫీని అందిస్తున్న ఈ చిత్రానికి కాంతార, విరూపాక్ష చిత్రాలతో అందరి మెప్పు పొందిన అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి శ్రీ నాగేంద్ర కళా దర్శకుడు. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా తెలియజేస్తారు.
.