ఫిఫ్టీ కొట్టిన 'దేవర'
Add ap7am to your home Screen

ఫిఫ్టీ కొట్టిన 'దేవర'

devara completes 50 days ntr
  • ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన మూవీ దేవర
  • సెప్టెంబర్ 27న రిలీజైన దేవర 
  • థియేటర్‌లలో 50 రోజులు పూర్తి చేసుకున్న దేవర
ఇటీవల కాలంలో సినిమాలు ఎక్కువ రోజులు థియేటర్‌లలో ప్రదర్శనలకు నోచుకోవడం లేదు. చాలా సినిమాలు కొన్ని వారాలకు మాత్రమే థియేటర్‌లకు పరిమితం అవుతున్నాయి. కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు తక్కువ రోజుల్లోనే భారీ కలెక్షన్స్ రాబట్టి వెళ్లిపోతున్నాయి. గతంలో వంద రోజులు, 50 రోజులు థియేటర్‌లలో ఫలానా సినిమా ప్రదర్శించడం జరిగింది అని ఆయా హీరోల అభిమానులు గొప్పగా చెప్పుకునే వారు. కానీ ప్రస్తుతం అటువంటి మాటలు వినబడటం లేదు. 

ఇటువంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన మూవీ దేవర సినిమా థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుని రికార్డు నెలకొల్పింది. దీంతో 52 కేంద్రాల్లో ఈ మూవీ 50 రోజులు ప్రదర్శితమైందని తెలియజేస్తూ చిత్ర బృందం పోస్టర్ విడుదల చేసింది. ఓటీటీలో అందుబాటులో ఉన్నప్పటికీ థియేటర్లలో దేవర మూవీ 50 రోజులు పూర్తి చేయడం విశేషంగా పేర్కొంటున్నారు. సెప్టెంబర్ 27న బాక్సాఫీసు ముందుకొచ్చిన దేవర ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 
Advertisement
Devara
NTR
Movie News

More Telugu News