బాంబు లాగా పేలిన ఆక్సిజన్ సిలిండర్.. అంబులెన్స్ లోని గర్భిణికి తప్పిన ముప్పు.. వీడియో ఇదిగో!

Pregnant Woman Has Narrow Escape As Oxygen Cylinder In Ambulance Explodes In Maharashtra
  • మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఘటన
  • ఇంజన్ లో నుంచి పొగలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్
  • పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లల్లో పగిలిన కిటికీలు
ప్రాణాపాయంలో ఉన్న రోగులను ఆసుపత్రికి తరలించే అంబులెన్స్ ఒకటి నడి రోడ్డు మీద పేలిపోయింది. ఎమర్జెన్సీ కోసం అందులో అమర్చిన ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో వాహనం తుక్కుతుక్కుగా మారింది. బాంబు దాడి జరిగినట్లు భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. మహరాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుందీ ఘటన. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

జల్గావ్ జిల్లాలోని దాదా వాడి ప్రాంతానికి చెందిన ఓ గర్భిణికి పురుటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు ఫోన్ చేశారు. గర్భిణితో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా అంబులెన్స్ లో ఆసుపత్రికి బయలుదేరారు. మార్గమధ్యంలో అంబులెన్స్ ఇంజిన్ లో నుంచి పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. అంబులెన్స్ ను రోడ్డు పక్కకు ఆపి కిందకు దిగాడు. గర్భినిణి, ఆమె కుటుంబ సభ్యులను కూడా దిగిపొమ్మని చెప్పాడు. వారంతా దిగి దూరంగా వెళ్లిన కాసేపటికే అంబులెన్స్ లో మంటలు రేగాయి. అందులోని ఆక్సిజన్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లల్లో కిటికీలు పగిలిపోయాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణనష్టం తప్పింది.
Go Back to Shorts
Ambulance
Explode
Oxygen Cylinder
Pregnant
Viral Videos
Maharashtra

More Telugu News