Sukumar: సుకుమార్‌ కోసం ఆగిపోయిన సినిమా ! 'పుష్ప-2' తరువాత మళ్లీ మొదలు!

Stopped movie for Sukumar Start again after Pushpa 2
షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం దర్శకుడు సుకుమార్‌ 'పుష్ప-2 ది రూల్‌' చిత్రీకరణతో పాటు నిర్మాణానంతర పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇండియాలోనే అత్యంత క్రేజీ ప్రాజెక్ట్‌గా నిర్మాణం జరుపుకుంటోన్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ కథానాయకుడు. డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను ఈ నెల 17న బీహార్‌లోని పాట్నాలో విడుదల చేస్తున్నారు. 

అయితే 'పుష్ప-2' చిత్రం విడుదలకు 'దిల్‌' రాజు నిర్మాణంలో రూపొందుతోన్న ఓ  సినిమా చిత్రీకరణకు సంబంధం ఉంది. వివరాల్లోకి వెళితే... సుకుమార్‌ శిష్యుడు కాశీ దర్శకత్వంలో ఆశిష్‌ రెడ్డి హీరోగా 'దిల్‌'రాజు నిర్మాతగా 'సెల్ఫీష్‌' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సుకుమార్‌ సొంత నిర్మాణ సంస్థ సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థ కూడా  ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటోంది. 

గత ఏడాది చిత్రీకరణ ప్రారంభించిన ఈ చిత్రం  యాభై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అయితే  ఈ చిత్ర కథలో కొన్ని మార్పుల కోసం 'దిల్‌'రాజు సుకుమార్‌ సలహాలు అడిగాడు. అయితే ప్రస్తుతం తాను పుష్ప-2 పనుల్లో బిజీగా ఉన్నానని... ఈ చిత్రం విడుదల తరువాత కథా చర్చల్లో ఉంటానని చెప్పడంతో రాజు 'సెల్ఫీష్‌' చిత్రీకరణను వాయిదా వేశాడు. 

 'పుష్స-2' రిలీజ్‌ తరువాత సుకుమార్‌తో కథలో మార్పుల గురించి చర్చించి, బ్యాలెన్స్‌ చిత్రీకరణ పూర్తిచేస్తానని దిల్‌ రాజు ఈ రోజ జరిగిన ప్రెస్‌మీట్‌లో తెలియజేశాడు. ఇక శిష్యుడు సినిమా కోసం సుకుమార్‌ టైమ్‌ కేటాయించడం నిజంగా అభినందనీయమని అంటున్నారు సినీ జనాలు. 
Go Back to Shorts
Sukumar
Dil Raju
Ashish
Selfish
Pushpa
Pushpa2
Cinema

More Telugu News