అల్లు అర్జున్‌తో జతకడుతున్న శ్రీలీల... పోస్టర్‌ విడుదల చేసిన మేకర్స్‌

అల్లు అర్జున్‌తో జతకడుతున్న శ్రీలీల... పోస్టర్‌ విడుదల చేసిన మేకర్స్‌

Srileela who is teaming up with Allu Arjun is the makers who released the poster
  • పుష్ప-2 ప్రత్యేక గీతంలో శ్రీలీల 
  • అధికారికంగా ప్రకటించిన మేకర్స్‌ 
  • శ్రీలీల పోస్టర్‌ విడుదల
అల్లు అర్జున్‌, సుకుమార్‌ కలయికలో రూపొందుతున్న చిత్రం 'పుష్ప-2' ది రూల్‌. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై, సుకుమార్‌ రైటింగ్స్‌ అసోసియేషన్‌తో నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం డిసెంబరు 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశలో వున్న ఈ చిత్రం మరో వైపు నిర్మాణానంతర పనులను కూడా శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రంలో ఉన్న ఓ ప్రత్యేక గీతంలో నర్తించబోయే హీరోయిన్‌ గురించి గత కొన్ని రోజులుగా రకరకాల పేర్లు వినిపించాయి. బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్ధ కపూర్‌, పూజా హెగ్డే, సమంత ఇలా పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రంలో ఉన్న ప్రత్యేక గీతంలో కథానాయిక శ్రీలీల నర్తించబోతున్నట్లుగా మేకర్స్‌ అఫీషియల్‌గా తెలియజేశారు. 

ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన ఓ ప్రత్యేక సెట్‌లో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. చంద్రబోస్‌ సాహిత్యం సమకూర్చిన ఈ పాటకు గణేష్‌ ఆచార్య కొరియోగ్రఫీని అందిస్తున్నట్లుగా తెలిసింది. 'పుష్ప ది రైజ్‌' చిత్రంలో సమంత చేసిన ఊ అంటావా.. మామా ఊఊ అంటావా ఐటెమ్‌సాంగ్‌ ఎంతటి పాప్యులారిటీని దక్కించుకుందో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. 

ఇప్పుడు తాజాగా 'పుష్ప-2'  ది రూల్‌లో శ్రీలీల, అల్లు అర్జున్‌లపై మాసివ్‌గా ఓ స్పెషల్‌ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. డ్యాన్స్‌ల విషయంలో ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్‌ చేసుకున్న అల్లు అర్జున్‌, డ్యాన్సుల్లో తన కంటూ ఓ స్పెషల్‌ ఇమేజ్‌ను పొందిన శ్రీలీల ఈ ఇద్దరి కలయికలో రాబోతున్న ఈ సాంగ్‌ పూర్తి మాసివ్‌గా ఉండబోతుందని తెలిసింది. త్వరలోనే ఈ పాట లిరికల్‌ వీడియోను కూడా విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. 

Advertisement
Pushpa2TheRule
Sreeleela
Allu Arjun
Pushpa2 item song
Mythri movie makers
Cinema

More Telugu News