'గేమ్ ఛేంజర్' టీజ‌ర్ విడుద‌ల‌కు తేదీ ఫిక్స్‌... ఎవ‌రూ ఊహించ‌ని వేదిక‌లో టీజ‌ర్ లాంచ్ వేడుక‌!
Add ap7am to your home Screen

'గేమ్ ఛేంజర్' టీజ‌ర్ విడుద‌ల‌కు తేదీ ఫిక్స్‌... ఎవ‌రూ ఊహించ‌ని వేదిక‌లో టీజ‌ర్ లాంచ్ వేడుక‌!

Ram Charan changes the game for his next Game Changer
  • రామ్ చరణ్, శంకర్ కాంబోలో 'గేమ్ ఛేంజర్‌'
  • ఈ నెల 9న టీజ‌ర్ లాంచ్‌
  • ల‌క్నో వేదిక‌గా టీజ‌ర్ లాంచ్ వేడుక‌
  • సంక్రాంతి కానుక‌గా జనవరి 10న విడుద‌ల కానున్న సినిమా
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంకర్ కాంబోలో వస్తున్న‌ చిత్రం 'గేమ్ ఛేంజర్‌'. ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జనవరి 10న విడుద‌ల కానుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే మూవీలోని రెండు పాట‌లు విడుదలై శ్రోతల‌ను బాగా ఆక‌ట్టుకున్నాయి. దీంతో అభిమానులు గేమ్ ఛేంజ‌ర్ టీజ‌ర్ కోసం ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. అయితే, ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీజర్‌ అప్‌డేట్ రానే వచ్చింది.

నవంబర్ 9న 'గేమ్‌ ఛేంజర్' టీజర్ రానుంది. కాగా, మేక‌ర్స్‌ ఈ టీజ‌ర్‌ లాంచ్ వేడుక కోసం ఎవ‌రూ ఊహించ‌ని వేదిక‌ను ఎంపిక చేసుకున్నారు. ల‌క్నో వేదిక‌గా టీజ‌ర్ లాంచ్ చేయబోతున్నారు. మొత్తానికి శంకర్ ఈసారి రూటు మార్చి ఏకంగా నార్త్ ఇండియాలో ప్లాన్ చేసి భారీ స్కెచ్ వేశాడనే చెప్పాలి. 

యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చెర్రీ స‌ర‌స‌న‌ బాలీవుడ్ భామ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో నవీన్‌ చంద్ర, సునీల్, శ్రీకాంత్‌, ఎస్‌జే సూర్య, స‌ముద్రఖని, బాలీవుడ్ న‌టుడు హ్యారీ జోష్‌, కన్నడ నటుడు జ‌య‌రామ్ న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తుండగా... ఎస్‌ఎస్‌ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement
Game Changer
Ram Charan
Tollywood

More Telugu News