Devara: 'దేవ‌ర' ఓటీటీలోకి వ‌చ్చేది ఆ రోజే.. అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది!

Devara is Ready to Streaming on Netflix from November 8th
షార్ట్స్‌లో చూడండి
యంగ్ టైగ‌ర్ ఎన్‌టీఆర్‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన కొత్త చిత్రం 'దేవ‌ర‌'. సెప్టెంబర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. అలాగే భారీ క‌లెక్ష‌న్లు కూడా కొల్ల‌గొట్టింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేందుకు రెడీ అయింది. 

ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 8 నుంచి అందుబాటులో ఉంటుంద‌ని సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించింది. 

ఇక మూవీలో తార‌క్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టించారు. మ‌రో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించారు. ఇత‌ర ప్రధాన పాత్రల్లో షైన్ టామ్ చాకో, ప్ర‌కాశ్ రాజ్‌, శ్రీకాంత్‌ నటించారు. నంద‌మూరి కల్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కల్యాణ్ రామ్ నిర్మించారు. త‌మిళ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద్ర‌న్ బాణీలు అందించారు.
Go Back to Shorts
Devara
Jr NTR
Koratala Siva
Netflix
Tollywood

More Telugu News