బాలీవుడ్ చిత్ర పరిశ్రమపై నటి రెజీనా ఆసక్తికర వ్యాఖ్యలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలీవుడ్ చిత్ర పరిశ్రమపై నటి రెజీనా ఆసక్తికర వ్యాఖ్యలు

Regina Cassandra calls Bollywood unforgiving
  • చాలామంది భాషాపరమైన సమస్య ఎదుర్కొంటున్నారన్న రెజీనా
  • దక్షిణాదిన అలాంటి ఇబ్బంది లేదని వెల్లడి
  • హిందీ సినిమాల్లో నటించాలంటే ముంబైలోనే ఉండాలంటారని వ్యాఖ్య
బాలీవుడ్ సినీ పరిశ్రమపై ప్రముఖ నటి రెజీనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పుడు చాలామంది భాషాపరమైన సమస్యను ఎదుర్కొంటారని, కానీ దక్షిణాదిన మాత్రం అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదన్నారు. ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... భాష విషయంలో స్పష్టత లేకుండా బాలీవుడ్ ఎవరినైనా తీసుకోవడానికి ఆసక్తి చూపించదన్నారు.

అలాగే, హిందీ సినిమాల్లో నటించాలంటే ముంబైలోనే ఉండాలని, సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. మనకు నచ్చకపోయినప్పటికీ బాలీవుడ్‌లో ఇది ముఖ్యమైనది అన్నారు. అయితే తన కోసం ఓ టీమ్ ఉందని, సినిమాల్లో అవకాశాల కోసం వారే తనకు సాయం చేస్తారని తెలిపారు. తాను ఆడిషన్స్‌లో మాత్రం పాల్గొంటానన్నారు.
Advertisement
Regina Cassandra
Bollywood
Tollywood
Hindi

More Telugu News