హరికృష్ణ మనవడు తారక రామారావును పరిచయం చేసిన డైరెక్టర్ వైవీఎస్ చౌదరి
Add ap7am to your home Screen

హరికృష్ణ మనవడు తారక రామారావును పరిచయం చేసిన డైరెక్టర్ వైవీఎస్ చౌదరి

YVS Chowdary Introduce NTR To Telugu Industrie
  • తారక రామారావు హీరోగా వైవీఎస్ చౌదరి సినిమా
  • మీడియా సమావేశానికి ముఖ్య అతిథులుగా రాఘవేంద్రరావు, అశ్వనీదత్
  • తారక రామారావును ఆదరించాలని కోరిన వైవీఎస్
నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు తారక రామారావును దర్శకుడు వైవీఎస్ చౌదరి మీడియాకు పరిచయం చేశారు. న్యూ టాలెంట్ రోల్స్ పతాకంపై తారక రామారావు హీరోగా వైవీఎస్ చౌదరి సినిమాను రూపొందిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సంబంధించిన పలు విషయాలను పంచుకునేందుకు వైవీఎస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, అశ్వనీదత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తారక రామారావును మీడియాకు పరిచయం చేశారు.

ఈ సందర్భంగా వైవీఎస్ మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్‌పై అభిమానంతోనే తాను ఇండస్ట్రీకి వచ్చానని, ఆయన ప్రోత్సాహం వల్లే తాను ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నానని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఇప్పుడు మళ్లీ తన మునిమనవడి రూపంలో వచ్చారన్నారు. ఎన్టీఆర్ అనే పేరు మూడక్షరాల తారకమంత్రం అయితే, ఈ తారక రామారావుది ఆరడుగుల రూపం అని చెప్పారు. తాను ఇప్పటి వరకు పరిచయం చేసిన హీరోలను అభిమానులు ఆదరించారని, ఈ తారక రామారావును కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నట్టు వైవీఎస్ పేర్కొన్నారు.
Advertisement
Taraka Rama Rao
NTR
YVS Chowdary
Tollywood

More Telugu News