చిరంజీవిని కలిసిన నాగార్జున
- 28న జరగనున్న ఏఎన్ఆర్ అవార్డుల కార్యక్రమానికి ఆహ్వానం
- ఈ ఏడాది తమకు ఎంతో ప్రత్యేకమని ట్వీట్ చేసిన నాగార్జున
- అమితాబ్ చేతుల మీదుగా అక్కినేని జాతీయ పురస్కారం అందుకోనున్న చిరంజీవి
అక్టోబర్ 28న అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అమితాబ్ చేతుల మీదుగా చిరంజీవి అక్కినేని జాతీయ పురస్కారం అందుకోనున్నారు. చిరంజీవిని వేడుకకు ఆహ్వానిస్తున్న ఫొటోలను నాగార్జున తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.