నాకు పబ్లిసిటీ చేసుకోవడం చేతకాదు: హీరో ప్రిన్స్
Add ap7am to your home Screen

నాకు పబ్లిసిటీ చేసుకోవడం చేతకాదు: హీరో ప్రిన్స్

Hero Prince Interview
  • గతంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ 
  • ప్రస్తుతం ముఖ్యమైన రోల్స్ తో బిజీ 
  • బ్రేకప్స్ ఉన్నాయని వెల్లడి 
  • మహేశ్ బాబు ఇష్టమని వ్యాఖ్య 
  • రాజమౌళి దర్శకత్వంలో చేయాలనుందని వివరణ

యంగ్ హీరోగా యూత్ కి పరిచయమైన ప్రిన్స్, ఆ తరువాత తనకి నచ్చిన పాత్రలను చేస్తూ ముందుకు వెళుతున్నాడు. ప్రధానమైన పాత్రలతో పాటు, కీలక రోల్స్ ను చేస్తున్నాడు. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు. 

"19 ఏళ్ల వయసులోనే నేను ఇండస్ట్రీకి వచ్చాను... 21 ఏళ్ల వయసులో హీరోను అయ్యాను. ఆ తరువాత సరైన గైడెన్స్ లేక ఇబ్బంది పడ్డాను" అని చెప్పాడు. 

"నవీన్ చంద్ర... సుధీర్ బాబు... సందీప్ కిషన్... నేను దాదాపు ఒకేసారి మా ప్రయాణాన్ని మొదలుపెట్టాము. ఎవరిదారిలో వాళ్లం ముందుకు వెళుతూనే ఉన్నాం. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు వాటిని మరిచిపోయి ముందుకు వెళ్లడానికి కొంత సమయం పడుతూ ఉంటుంది. లవ్ లు... బ్రేకప్ లు చాలానే ఉన్నాయి. వాటి గురించే ఆలోచిస్తూ బాధపడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇక అలాంటి విషయాల జోలికి వెళ్లే సమయం లేదు" అని అన్నాడు. 

"నేను పెద్ద హీరోలతో కలిసి ఎక్కడా కనిపించను... అందరితో కలివిడిగా ఉండను అనే విమర్శలో నిజం లేదు. నేను అందరిని కలుస్తాను... వాళ్లతో హ్యాపీగా మాట్లాడతాను... ఆ మూమెంటును ఎంజాయ్ చేస్తాను. అంతేగానీ వెంటనే వాళ్లతో ఫొటో దిగేసి సోషల్ మీడియాలో పెట్టి పబ్లిసిటీ చేసుకోను. అలా చేయడం నాకు ఇష్టం ఉండదు కూడా. హీరోలలో నాకు మహేశ్ బాబుగారు అంటే ఇష్టం. ఇక రాజమౌళి గారి దర్శకత్వంలో చేయాలనేది నా కల" అని అన్నాడు.
Advertisement
Prince
Ntr
Mahesh Babu
Rajamouli

More Telugu News