Amaran: సాయిప‌ల్ల‌విపై శివ కార్తికేయ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. ఆమె త‌న‌ను అలా పిలిచినందుకు చాలా ఫీల‌య్యాన‌న్న స్టార్ హీరో!

Hero Sivakarthikeyan Interesting Comments on Heroine Sai Pallavi
షార్ట్స్‌లో చూడండి
నేచురల్ బ్యూటీ సాయిప‌ల్ల‌వి, కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయ‌న్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం 'అమ‌ర‌న్‌'. ఈ మూవీ ఈ నెల 31న విడుద‌ల కానుంది. తాజాగా సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం చెన్నైలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న హీరో శివ కార్తికేయ‌న్ హీరోయిన్ సాయిప‌ల్ల‌వి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 

  "నేను ఓ టీవీ ఛానెల్‌కు ప‌నిచేస్తున్న‌ప్పుడు సాయిప‌ల్ల‌విని తొలిసారి క‌లిశాను. నేను వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఓ కార్య‌క్ర‌మంలో ఆమె పాల్గొన్నారు. ఇక 'ప్రేమ‌మ్' చిత్రంలో ఆమె న‌ట‌న చూసి ఫిదా అయ్యాను. వెంట‌నే ఫోన్ చేసి ప్ర‌శంసించా. అయితే, ఆమె వెంట‌నే 'థాంక్స్ అన్నా' అని చెప్పింది. న‌న్ను అన్నా అన్నందుకు అప్పుడు చాలా ఫీల‌య్యాను. కానీ ఆమె అప్ప‌టికీ ఇప్ప‌టికీ గొప్ప న‌టినే. ఆమె పేరే ఒక బ్రాండ్" అంటూ శివ కార్తికేయన్ చెప్పుకొచ్చారు. 

ఇక అమ‌ర‌న్ మూవీలో శివ కార్తికేయ‌న్ ఆర్మీ అధికారి మేజ‌ర్ ముకుంద్ వ‌ర‌ద‌రాజ‌న్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఇదో బ‌యోగ్రాఫిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. రాజ్ కుమార్ పెరియ‌సామి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో ప్ర‌స్తుతం చిత్రం యూనిట్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంది.  
Go Back to Shorts
Amaran
Sivakarthikeyan
Sai Pallavi
Kollywood

More Telugu News