కోపాలు చాలండి... శ్రీమతి గారు అంటోన్న లక్కీ భాస్కర్
- లక్కీ భాస్కర్ నుండి తొలి లిరికల్ పాట విడుదల
- క్యాచీ పదాలతో ఆకట్టుకుంటున్న లిరిక్స్
- ట్యూన్‌తో మెస్మరైజ్ చేసిన జీవి ప్రకాష్‌కుమార్
- సాహిత్యం అందించిన శ్రీమణి
ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రం నుంచి "కోపాలు చాలండి శ్రీమతి గారు... కొంచెం కూల్ అవ్వండి మేడమ్ గారు" అంటూ కొనసాగే లిరికల్ వీడియోను చిత్రబృందం మంగళవారం సాయంత్రం విడుదల చేసింది.
శ్రీమణి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని విశాల్ మిశ్రా, శ్వేత మోహన్ ఆలపించారు. జీవి ప్రకాష్ స్వరాలు అందించారు. రొమాంటిక్ మెలోడి సాంగ్‌గా ఆకట్టుకున్న ఈ పాటలో భార్యభర్తల అనుబంధం, ప్రేమ, పెళ్లి ఇలా అన్ని ఎమోషన్స్ చూపించారు. లిరిక్స్ అండ్ ట్యూన్ ఆకట్టుకునే విధంగా వుంది.