Devara: 16 రోజుల దేవర వసూళ్లను అధికారికంగా ప్రకటించిన మేకర్స్‌

The makers have officially announced 16 days of Devar collections
షార్ట్స్‌లో చూడండి
ఎన్టీఆర్‌, కొరటాల శివ కలయికలో రూపొందిన చిత్రం 'దేవర'. జనతా గ్యారేజ్‌ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తరువాత ఈ క్రేజీ కాంబినేషన్‌ దేవర కోసం మరోసారి జతకట్టారు. ప్రముఖ కథానాయిక స్వర్గీయ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ ఈ చిత్రం ద్వారానే టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. సెప్టెంబర్‌  27న ప్రేక్షకుల ముందుకొచ్చిన దేవర ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా దూసుకుపోతోంది. 

మంచి వసూళ్లతో ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటికీ షేర్‌లు రాబడుతూ వసూళ్ల విషయంలో సంతృప్తికరంగానే వుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వసూళ్లకు దసరా సెలవులు అడ్వాంటేజీగా నిలిచాయి. ఇక ఈ  చిత్రంలో దేవర, వర అనే రెండు పాత్రల్లో ద్విపాత్రాభినయంలో నటించిన ఎన్టీఆర్‌ నటనకు ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 

అయితే ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 16 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 509 కోట్ల రూపాయల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసినట్లుగా అఫీషియల్‌గా ఓ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఆచార్యతో అపజయాన్నిచూసిన కొరటాల శివకు దేవర మంచి కమ్‌బ్యాక్‌ ఫిలిమ్‌ అని చెప్పుకోవాలి. అంతేకాదు ఎన్టీఆర్‌-కొరటాల శివ జోడి చేసిన రెండు చిత్రాలు విజయవంతం కావడం కూడా ఎన్టీఆర్‌ అభిమానుల్లో మంచి సంతోషాన్ని నింపింది. 
.
Go Back to Shorts
Devara
Ntr
Devara collections
Devara box office
Koratala Siva
Ntr latest news
Tollywood

More Telugu News