మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనేమో: ఎన్టీఆర్‌

Cant repay your debt in this life NTR
  • బ్లాక్‌బస్టర్‌ జర్నీ ఆఫ్‌ దేవర ఇంటర్వ్యూ విడుదల 
  • నా అభిమానులు 24 ఏళ్ల నుండి నన్ను మోస్తున్నారు 
  • అభిమానులను కలవలేదనే వెలితి వుండిపోయింది
ఎన్టీఆర్‌ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'దేవర'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. సినిమా రెండోవారంలోకి అడుగుపెట్టినా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పుడు దసరా సెలవులు దేవరకు బిగ్గెస్ట్‌ అడ్వాంటేజీగా మారాయి. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ దేవర, వరగా చేసిన ద్విపాత్రాభినయానికి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. 

ఇదిలా వుండగా ఈ చిత్రానికి సంబంధించి బ్లాక్‌బస్టర్‌ జర్నీ ఆఫ్‌ దేవర పేరుతో ఓ ప్రమోషనల్‌ వీడియో విడుదలైంది. ఎన్టీఆర్‌, కొరటాల శివ సినిమా జర్నీ గురించి పలు ఇంట్రెస్టింగ్‌ విషయాలను ఈ వీడియోలో పంచుకున్నారు. ముఖ్యంగా ఈ చిత్రం ప్రీరీలీజ్‌ వేడుక క్యాన్సిల్‌ కావడంతో అభిమానులను కలుసుకోలేకపోవడం తనకు చాలా బాధగా వుందని ఎన్టీఆర్‌ అన్నారు. 

ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ 'ప్రీ రిలీజ్‌ వేడుక క్యాన్సిల్‌ తరువాత అభిమానుల కోసం మరో వేడుక పెట్టాలని అనుకున్నాం ఎందుకంటే ...అభిమానులు నన్ను చూడటం కంటే వాళ్లను నేను చూడటం నాకు ఆనందం. నా అభిమానులతో ఎలాగైనా కలవాలి.. లేదంటే నాకు వెలితిగా వుంది. ఎలాగైనా వాళ్లతో సక్సెస్‌ పార్టీ పెట్టాల్సిందే అనుకున్నాను. కానీ దేవి నవరాత్రుల వల్ల బహిరంగ వేడుకలకు అనుమతులు రాలేదు. అభిమానులతో నాది ఎప్పుడూ విడదీయలేని అనుబంధం. 

వాళ్లతో నా జర్నీ ఎంతో మధురం. నన్ను  సినీ పరిశ్రమలో 24 ఏళ్లు మోశారు అభిమానులు. అది నెవర్‌ బి రీపెయిడ్‌. దేవర మీద కురిపించిన ప్రేమకు, నామీద కురిపించిన ప్రేమకు ఈ జన్మలో వాళ్ల రుణం తీర్చుకోలేను. కాకపోతే అభిమానులు కాలర్‌ ఎత్తుకుని తిరిగేలా చేయడం నా బాధ్యత. నిరంతరం నేను దానికోసమే ప్రయత్నిస్తాను. మీకు జీవితాంతం రుణ పడి వుంటాను' అంటూ చెప్పుకొచ్చారు 
Go Back to Shorts
Devara
Ntr
Ntr interview
Koratala Siva
Ntr arts
Tollywood

More Telugu News