టాలీవుడ్ లో తన అభిమాన హీరో ఎవరో చెప్పిన ప్రకాశ్ రాజ్!

prakash raj speech in devara movie success event
  • దేవర చిత్రం సక్సెస్ మీట్‌లో పాల్గొన్న ప్రకాశ్ రాజ్ 
  • ఆస్కార్ అవార్డు ఫంక్షన్‌లో దిగ్గజాల ముందు తారక్ మాట్లాడిన తీరు చూసి గర్వపడ్డానని పేర్కొన్న ప్రకాశ్ రాజ్
  • దర్శకుడికి అండగా తారక్ నిలబడ్డాడని కితాబు 
'తెలుగు సినిమా రంగంలో నాకు నచ్చిన హీరోల్లో మంచి నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది తారక్ (ఎన్టీఆర్)' అని సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ కథానాయకుడుగా వచ్చిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్రం యూనిట్ తాజాగా సక్సెస్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా ఎన్టీఆర్ తో పాటు కొరటాల శివ, రాజమౌళి, అనిరుధ్ రవిచందర్, నందమూరి కల్యాణ్ రామ్, దిల్ రాజు, ప్రకాశ్ రాజ్ తదితరులు హజరయ్యారు. 

ఈ విజయోత్సవ వేడుకల్లో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. దేవర ఇంతటి ఘన విజయం సాధించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. తనకు తారక్ అంటే ఎంతో ప్రేమ ఉందని చెప్పారు. ఆస్కార్ ఫంక్షన్‌లో ఎంతో మంది దిగ్గజాల ముందు తారక్ మాట్లాడుతుంటే తాను ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ ఎంతో గర్వపడ్డానని తెలిపారు. ఈ సినిమా కోసం ఒక దర్శకుడికి తారక్ అండగా నిలబడ్డాడని పేర్కొన్నారు.   
Advertisement
Prakash Raj
devara
Movie News

More Telugu News