టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ఎమ్మెల్యే కొలికపూడికి వ్యతిరేకంగా మహిళల నిరసన
- మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపణలు
- పథకం ప్రకారం తనపై చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరని అంటున్న ఎమ్మెల్యే కొలికపూడి
- పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో దీక్ష విరమించిన ఎమ్మెల్యే కొలికపూడి
మరో పక్క, తనపై చేసిన ఆరోపణలు నిజమైతే అరెస్టు చేసి శిక్షించాలని, లేని పక్షంగా ఆరోపణలు చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన క్యాంప్ కార్యాలయంలో దీక్ష చేపట్టారు. అయితే పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో సోమవారం రాత్రి ఆయన తన దీక్షను విరమించారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో దీక్షను విరమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సోమవారం రాత్రి ఆయన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. తనపై ఆరోపణలు చేస్తున్న మహిళ ఇప్పటి వరకూ నాలుగు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని చెప్పారు. ఆమె భర్తపై పోలీసులు ఎప్పుడు కేసు పెట్టినా ఇలాంటి ఆత్మహత్య డ్రామాలు అడుతుంటుందని ఆరోపించారు. తనపై పథకం ప్రకారం చేస్తున్న అసత్య ప్రచారాన్ని నియోజకవర్గ ప్రజలు నమ్మరని కొలికపూడి అన్నారు.